పాకిస్తాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు - డోనాల్డ్ ట్రంప్

Wednesday, February 27, 2019 10:00 AM News
పాకిస్తాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు - డోనాల్డ్ ట్రంప్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు ధన సహాయం నిలిపేసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంచి పని చేశారని దక్షిణకరోలినా మాజీ గవర్నర్, ఇండియన్ అమెరికన్ నిక్కీహేలి ప్రశంసించారు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్లు(రూ.3వేల కోట్లు) ఇవ్వబోమని ట్రంప్ స్వయంగా ప్రకటించి సంచలనం సృష్టించారని ఆమె పేర్కొన్నారు. పాక్ సైనికులకు అమెరికా చేస్తున్న ధనసాయంతో పాక్ పరోక్షంగా అమెరికాపై యుద్ధం చేస్తోందని నిక్కీ చెబుతున్నారు. అప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు పాక్ ధనసాయం చేసిందన్నారు.

అప్ఘన్‌లో ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అమెరికా చేసిన యుద్ధంలో పాక్ ఉగ్రవాదులకు సాయం చేసి అమెరికా సైనికులను చంపేసిందన్నారు. అంతేకాకుండా 2017లో అమెరికా అత్యధిక మొత్తంలో పాక్‌కు 1బిలియన్ డాలర్లు(రూ.7వేల కోట్లు) ధనసాయం చేసిందని ఆమె గుర్తు చేశారు. అమెరికా అంతపెద్ద మొత్తంలో ధన సాయం చేస్తున్న దేశాల్లో పాక్ ఆరోస్థానంలో నిలిచిందని నిక్కీ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుపడుతూ ఉగ్రవాదులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్న పాక్‌కు బుద్ధి చెప్పాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అప్పటిదాకా పాక్‌కు ఒక్క పైసా ధనసాయం చేయొద్దని అమెరికా ప్రభుత్వానికి ఆమె సూచించారు. ఇదిలావుండగా ఐక్యరాజ్యసమితిలో నిక్కీ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో ఉగ్రవాద నిర్మూలనకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాక్ అడ్డుతగిలేదని ఆమె తెలిపారు.   

For All Tech Queries Please Click Here..!