చర్చిపై దాడి.. 34 మంది మృతి
Monday, July 28, 2025 08:53 AM News
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుకూల తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. తూర్పు కాంగోలోని ఇస్లామిక్ స్టేట్ మద్దతు గల అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ADF)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు చర్చి లోపల, వెలుపల విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చర్చి ఆవరణలోని పలు ఇళ్లు, దుకాణాలను దహనం చేశారు. ఈ దాడుల్లో 34 మంది వరకు చనిపోయారని ఓ సామజిక కార్యకర్త మీడియాకు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
