ఒక్క బండికి 233 చలాన్లు
Sunday, June 22, 2025 04:00 PM News
ఒక్క టూవీలర్ పై వందల్లో చలాన్లు దర్శనమివ్వడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అటువైపుగా వచ్చిన ఓ స్కూటీని ఆపి పెండింగ్ చలాన్లను చెక్ చేయగా 233 చలాన్లు ఉండటంతో షాకయ్యారు. వాటిపై రూ.45,350 ఫైన్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 2016 నుంచి చలాన్లు పెండింగ్లో ఉన్నాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



