గుడ్డును వాడే ముందు వీటి గురించి తెలుసుకోండి..!

Sunday, December 9, 2018 10:09 PM Lifestyle
గుడ్డును వాడే ముందు వీటి గురించి తెలుసుకోండి..!

రోజూవారీ ఆహారంలో కోడిగుడ్డు పరిపాటిగా మారిపోయింది. అయితే, వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో గుడ్లును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కోడిగుడ్డును ఉపయోగించే చిట్కాలు చూద్దాం రండి...

  • ఎక్కువ వాసస వచ్చే చేపలు, ఉల్లిపాయలు లాంటి వాటి దగ్గర గుడ్లను ఉంచకూడదు. పెంకు మీదున్న సూక్ష్మరంధ్రాల్లోంచి ఆ వాసన లోపలికి వెళ్లి అంటుకుంటుంది.
  • గుడ్డు పగిలి నేలమీద సోనకారితే దాన్ని బట్టతో తుడవకూడదు. ఆ సోన మీద ఉప్పుని చల్లి ఎండిపోయాక ఊడ్చేస్తే పోతుంది.
  • పళ్లాన్ని గిన్నెమీద ఏటవాలుగా ఉంచి ఆ పళ్లెంమీద గుడ్డును పగలకొడితే అందులోని సోన పళ్లెంమీదుగా గిన్నెలోకి జారుతుంది.
  • ఎగ్‌లోని పచ్చసొన, తెల్లసొనని తేలిగ్గా విడదీయడానికి ఓ చిట్కా. ఎగ్‌ని కొట్టి అందులోని సొనని పళ్లెంలోకి వంచాక పచ్చసొన మీద ఓ గ్లాసుంచి గిన్నెలోకి వంచితే తెల్లసొన గిన్నెలోకి కారి పచ్చసొన ఆ గ్లాసు కింద నిలుస్తుంది.
  • ఫ్రిజ్‌లోని గుడ్లలో ఏవి తాజావో, ఏవి ఉడికించినవో తెలుసుకోడానికి గుడ్లని బాయిల్డ్‌ చేసే నీటిలో కొద్దిగా ఫుడ్‌ కలర్‌ని వేసి చూస్తే ఆ రంగు తెల్లటి పెంకుకి అంటి తెలుస్తుంది. కలర్‌ మారుస్తుంటే ఏవి ఏ రోజు ఉడకబెట్టినవో గుర్తించవచ్చు.
  • నీళ్లలో వేసిన ఎగ్‌ తేలిగ్గా, నిలువుగా నిలబడ్డా అది పాడయిపోయిన గుర్తు. అడ్డంగా అడుగు భాగానికి చేరితే అది మంచి గుడ్డని గుర్తించండి. 
  • కోడిగుడ్డు ఆమ్లెట్‌ తయారీకి మునుపు ప్యాన్ మీద టేబుల్‌సాల్ట్‌తో తుడిస్తే ఆమ్లెట్‌ ప్యాన్‌కు అంటుకోదు.
  • గుడ్డు ఉడికించే ముందు సూదితో లావుగా ఉన్న వైపు చిన్నబెజ్జం చేస్తే పెంకుపగిలి సొన బయటకి కారదు.

For All Tech Queries Please Click Here..!