ఈ పండ్లు ఫ్రిజ్ లో పెడితే ఎంత ప్రమాదమో తెలుసా..

Wednesday, April 23, 2025 07:12 AM Lifestyle
ఈ పండ్లు ఫ్రిజ్ లో పెడితే ఎంత ప్రమాదమో తెలుసా..

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ వాటిని ఎలా నిల్వ చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ లో పెడితే పండ్లు పాడవకుండా ఉంటాయని అనుకుంటారు. కేవలం కొన్ని రకాల పండ్లు మాత్రమే కూలింగ్ ఉండే చోట నిల్వ చేయడం మంచిది. ముఖ్యంగా ఈ 5 రకాల పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నారంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు.

అరటిపండ్లు: అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా నల్లబడతాయి. వాటి తీపి రుచి తగ్గుతుంది. చల్లని ఉష్ణోగ్రతలు అరటిపండ్లలోని చక్కెరలను విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా అవి గట్టిగా లేదా గుజ్జుగా మారతాయి. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద, పరిపక్వం చెందని పండ్లతో దూరంగా, వెలుతురు గాలి బాగా ఆడే చోట నిల్వ చేయండి. 

మామిడిపండ్లు: మామిడిపండ్లు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి సహజ రుచి జ్యూసీ ఆకృతి దెబ్బతింటాయి. చల్లని ఉష్ణోగ్రతలు మామిడిలోని పోషకాలను, ముఖ్యంగా విటమిన్ సి, తగ్గిస్తాయి. మామిడిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద, నీడలో, గాలి ఆడే ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. అవి పూర్తిగా పండిన తర్వాత, వాటిని కొన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు, కానీ ఎక్కువ కాలం కాదు. పండిన మామిడును కోసి గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్‌లో నిల్వ చేయడం మంచిది.

పైనాపిల్స్: పైనాపిల్స్ ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అవి తమ తీపి రుచిని కోల్పోయి గుజ్జుగా మారతాయి. చల్లని ఉష్ణోగ్రతలు ఎంజైమ్‌లను నిష్క్రియం చేస్తాయి. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద, సూర్యకాంతి నుండి దూరంగా నిల్వ చేయండి. ఒకవేళ మీరు పైనాపిల్స్ కట్ చేసినట్లయితే గాలి చొరబడని కంటైనర్‌లో ఫ్రిజ్‌లో 2-3 రోజులు మాత్రమే ఉంచండి.

అవకాడోలు: అవకాడోలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి సరిగ్గా పండకుండా పోతాయి. వాటి క్రీమీ ఆకృతి దెబ్బతింటుంది. అవకాడోలు గది ఉష్ణోగ్రత వద్ద పరిపక్వం చెందడానికి ఉంచాలి. అవి పండిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ ఎక్కువ కాలం కాదు. 

నిమ్మ, ఆరెంజ్: సిట్రస్ పండ్లు, లెమన్, ఆరెంజ్, వంటివి ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, జ్యూసీతనం తగ్గుతాయి. చల్లని ఉష్ణోగ్రతలు వీటి తొక్కను గట్టిపరుస్తాయి. రసాన్ని తగ్గిస్తాయి. సిట్రస్ పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద, గాలి ఆడే చోట సూర్యకాంతి నుండి దూరంగా నిల్వ చేయండి. ఒకవేళ వాటిని కట్ చేసినట్లయితే గాజు కంటైనర్‌లో ఫ్రిజ్‌లో 2-3 రోజులు నిల్వ చేయవచ్చు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: