పురుషులు ప్రతిరోజూ తీసుకోవలసిన 8 రకాల ఉత్తమ ఆహార పదార్ధాలు ఇవే !

Saturday, December 1, 2018 05:04 PM Lifestyle
పురుషులు ప్రతిరోజూ తీసుకోవలసిన 8 రకాల ఉత్తమ ఆహార పదార్ధాలు ఇవే !

అమెరికాలో ప్రచురించబడే “బెస్ట్ లైఫ్” మేగజైన్ ప్రతిరోజూ తీసుకోవలసిన ఎనిమిది రకాల ఉత్తమ ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పూర్తిగా పురుషులను దృష్టిలో ఉంచుకుని తయారుచేసినా కూడా, ఈ ఆహారాలను మహిళలు కూడా వారి ఆహార ప్రణాళికలో కూడా జోడించుకోవచ్చునని తెలుపబడింది.

పాలకూర : ఇది ఆకుపచ్చ రంగులతో మరియు ఆకులతో కూడుకుని ఉండవచ్చు, కానీ పురుషులకు సూచించదగినదిగా, పాలకూర ఉత్తమమైన ఆహార పదార్ధంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక మొత్తంలో మొక్క ఆధారిత ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మరియు ఫోలేట్ యొక్క గొప్ప మూలంగా కూడా ఉంటుంది. క్రమంగా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మరియు బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పొరాసిస్) ప్రమాదాలను తగ్గిస్తుంది. అదనంగా : ఫోలేట్ పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, పాలకూర లూటేన్తో నిండి ఉంటుంది, ఇది వయస్సు ఆధారిత మచ్చల క్షీణతతో పోరాడగల సమ్మేళనంగా చెప్పబడుతుంది.

యోగర్ట్ : వివిధ సంస్కృతులు యోగర్ట్ తమ స్వంత సృష్టిగా చెప్పుకుంటున్నాయి. కానీ 2,000 ఏళ్ల నుండి వస్తున్న కొన్నిరకాల ఆహార పదార్ధాల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పటికీ, ఏమాత్రం వివాదాస్పదంగా లేవు అన్నది వాస్తవం. మీ శరీరంలో లాభదాయకమైన మంచి బ్యాక్టీరియా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు, రోగనిరోధకశక్తిని పెంచేందుకు, మరియు కాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కాపాడేందుకు శరీరానికి సరైన మోతాదులో ప్రోబయోటిక్స్ అవసరంగా ఉంటుంది. కానీ అన్నిరకాల యోగర్ట్స్ ప్రోబయోటిక్ లక్షణాలను కలిగి ఉండవు. కావున యోగర్ట్ లేబుల్స్ మీద "లివ్ అండ్ యాక్టివ్ కల్చర్స్" అని ఉన్నదో లేదో చూసి నిర్ధారణకు రావడం మంచిది.
 

క్యారెట్లు: అధిక ఎరుపు, పసుపు, లేదా నారింజ రంగులో ఉండే కూరగాయలు మరియు పండ్లు ఎక్కువ మొత్తాలలో కేరోటినాయిడ్లను కలిగి ఉంటాయి(కొవ్వును కరిగించే సమ్మేళనాలతో). ఇవి క్యాన్సర్లను వ్యాప్తి చెందకుండా తగ్గించడంలో, అలాగే ఆస్త్మా మరియు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి శోథ, వాపు సంబంధిత పరిస్థితులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడగలవు. పైగా వీటిలో క్యాలరీల సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది.
 

For All Tech Queries Please Click Here..!