గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే..

Thursday, July 3, 2025 11:00 AM Lifestyle
గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే..

కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించి ముందే చికిత్స తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉందంటుని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

హార్ట్ ఫెయిల్యూర్ కు ముందు మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. వేగంగా నడిచేటప్పుడు, మెట్లు ఎక్కే సమయంలో ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. చిన్న చిన్న పనులు చేసినా శ్వాస ఆడదు. విపరీతమైన నీరసంలా అనిపించి అలసిపోయిన భావన కలుగుతుంది పాదాలు, కాళ్లు, చీలమండలలో నీరు చేరి ఉబ్బుతాయి. పొత్తి కడుపు దగ్గర కూడా నీరు చేరి బరువు పెరుగుతారు. గుండె కొట్టుకునే వేగం మారుతుంది. ఎప్పుడూ గుండె దడ భావన కలుగుతుంది. శ్వాస తీసుకున్నప్పుడు గురకలాంటి శబ్దం ఎక్కువగా వస్తుంది. దగ్గు అధికంగా వస్తుంది. గుండె సమస్యతో బాధపడేవారు ఆకస్మికంగా బరువు పెరుగుతారు. ఆకలి వేయదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహాలను పాటించాలి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: