ఉడికించిన కోడిగుడ్లను ఎంత సమయంలోపు తినాలి?

Thursday, January 31, 2019 05:30 AM Lifestyle
ఉడికించిన కోడిగుడ్లను ఎంత సమయంలోపు తినాలి?

గుడ్డు మధ్యతరగతి పోషకాహారం. దీని ఉడకబెట్టి తినాలా? లేక కూరగా చేసుకొని తినాలా? లేదా నూనెలో ఫ్రై చేసుకొని తినాలా? లేదా రా గుడ్డు  తాగాల ఈ సందేహం అందరికీ వస్తుంది.

ఎలా తింటే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటే మాత్రం.. ఉడకబెట్టి తింటేనే లాభం అనేది అందరికీ తెలిసిందే..!

రా గుడ్డు ని అరిగించుకోవడానికి మన బాడీ కి ఎక్కువ టైం పడుతుంది మరియు రా గుడ్డు లో వున్న అన్ని ప్రోటీన్స్ ని మన బాడీ తీసుకోలేదు. గుడ్లను ఉడకబెట్టి తింటే పోషకాలు మన బాడీ కి బాగా అందుతాయి, అయితే గుడ్లను ఉడకబెట్టి చాలా మంది లేట్ గా తింటారు. వాస్తవానికి ఆలా చేయకూడదు. అలా చేస్తే గుడ్డుపై వైరస్, బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంది. కనుక ఉడికించిన గుడ్లను ఒకపూట వరకు బయట ఉంచవచ్చు. కానీ పూట గడవక ముందే తినటం మంచిది.

పొట్టు తీయకుండా ఉంచితే కొంచం ఎక్కువసేపు గుడ్డు పాడుఅవకుండా ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!