స్కిన్ అలర్జీ నివారించటానికి ఇంటి చిట్కాలు

Wednesday, February 20, 2019 05:45 PM Lifestyle
స్కిన్ అలర్జీ నివారించటానికి ఇంటి చిట్కాలు

స్కిన్ అలర్జీలు అనగా(చర్మం ఎర్రగా మారటం, దురదలు రావటం) వలన మనకి తాత్కాలికంగా మరియు తీవ్రంగా సమస్యలకు గురి చేస్తుంటాయి. తాత్కాలికంగా వచ్చే దురదలు కి చర్మ సమస్యలకు వైద్యుడిని లేదా చర్మ నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఇంటి చిట్కాలు వాడటం వలన స్కిన్ అలర్జీ మరియు ఇతరేతర చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

కొబ్బరి నూనె వాడండి

సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్దమైన గుణాలను కలిగి ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు దురదలను కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు.

వేప ఆకు

వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు.

తేనే

తేనే చాలా రకాలుగా చర్మానికి ఉపయోగపడుతుంది మరియు ఈ సహజ సిద్దమైన ఇంట్లో ఉండే ఔషదం వలన చర్మం స్వస్థతకు గురైనపుడు, ఇతర అన్ని చర్మ సమస్యలకు ఔషదంగా వాడవచ్చు. ముఖ్యంగా మొటిమలు పగిలినపుడు, తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. మీ చర్మ సమస్యలను తగ్గించటానికి తేనే మరియు దాల్చిన చెక్క పొడిని కలిపిన మిశ్రమాలను చర్మానికి వాడండి.

ఆలివ్ ఆయిల్

మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు, పడుకోటానికి ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్’తో మసాజ్ చేయండి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తొలగించాలి.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలను సహజసిద్ద ‘డి-టాక్సీఫయర్’గా చెప్పవచ్చు, కానీ చర్మ సమస్యలకు చాలా అరుదుగా వాడుతుంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన చర్మాన్ని అందంగా కనపడటానికి మరియు స్వస్థతలకు గురైన చర్మానికి చికిత్సలుగా ఈ నల్ల మిరియాలను వాడుతుంటారు.

నీరు

సరైన మొత్తంలో నీటిని తాగటం వలన, రక్త ప్రసరణలో ఉండే హానికర పదార్థాలను మరియు విష పదార్థాలను తోలగిస్తుంది. ఈ విష పదార్థాల వలన చర్మాన్ని పగిలేల చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటేడ్’గా ఉంచుకోవటం వలన మీ చర్మం నుండి ఆయిల్ వేరు చేయబడుతుంది. అంతేకాకుండా, నీరు మీ చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ విటమిన్ ‘C’లను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది, చర్మ సమస్యలకు ఇది శక్తి వంతంగా పని చేస్తుంది. మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నారా? అయితే నిమ్మకాయ నుండి చిన్న ముక్కను కత్తిరించి, ప్రభావిత ప్రాంతంలో రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

For All Tech Queries Please Click Here..!