ఈ నీళ్లు తాగితే షుగర్, బీపీ కంట్రోల్.. ఇంకా బోలెడు ప్రయోజనాలు

మండుతున్న ఎండలకు బార్లీ నీళ్ళు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఎండలకు శరీరంలో నీరు ఆవిరైపోయి డీహైడ్రేషన్ కు గురయ్యేవారికి బార్లీ నీటితో ఉపశమనం కలుగుతుంది. యాంటి ఆక్సిడెంట్ లు, పోషకాలు బార్లీ నీటిలో అధికంగా ఉంటాయి.
ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతూ మూత్రం కూడా సరిగ్గా రాక అనేకమంది బాధపడుతుంటారు. అలాంటి వారికి మూత్రం సాఫీగా రావటంతో పాటు, మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటకు బార్లీ నీరు తాగితే ఉపశమనం కలుగుతుంది. మూత్ర విసర్జన సమయంలో దుర్వాసన సమస్యకు బార్లీ గింజల నీరు తాగడం వలన విముక్తి లభిస్తుంది. బార్లీ నీటిలో ఫైబర్ తగిన మోతాదులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు బార్లీ నీటిని తాగడం వల్ల ఉపయోగాలే తప్ప ఎలాంటి హాని జరగడానికి ఆస్కారం లేదు. అధిక రక్తపోటు తో బాధ పడుతున్న వారికి కూడా బార్లీ నీరు తాగడం వలన ప్రయోజనం ఉంటుంది. బార్లీ నీరు అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
బార్లీ నీరు తీసుకోవడం వలన అధిక బరువుని నియంత్రించవచ్చు. అయితే మీరు వ్యాయామం చేసే సమయంలో లేదా వ్యాయామం చేసిన తరువాత ఈ నీరు తాగితే మీ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ నీరు తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ పనితీరు మరింత మెరుగుపడుతుంది. ఛాతీలో మంట, గ్యాస్ సమస్యతో బాధ పడేవారికి ఈ బార్లీ నీటిని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. మలబద్దక సమస్యతో ఇబ్బంది పడేవారికి బార్లీ నీరు మంచి మెడిసిన్ లాగ పనిచేస్తుంది. కాకపోతే ఉదయానే పరగడుపున ఈ నీటిని సేవిస్తే మంచి ఫలితం దక్కుతుంది.