నిద్రలో అలా జరుగుతోందా..?
Monday, August 11, 2025 10:25 PM Lifestyle
నిద్రలో కొందరికి చేతులు, కాళ్లు మొద్దుబారిపోతుంటాయి. ఇది ఒక రకమైన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ B12, B6, మెగ్నీషియం లోపం వల్ల నరాలు బలహీనపడి ఒత్తిడికి గురవుతాయి.
మణికట్టు నరాలపై ఒత్తిడి పెరిగితే వేళ్లు, సయాటిక్ నాడీపై ఒత్తిడి పెరిగితే కాళ్లు, మోచేతి నరాలపై ఒత్తిడి పెరిగితే చేతులు తిమ్మిరి ఎక్కుతాయి. మెరుగైన రక్త ప్రసరణకు వ్యాయామం చేయాలని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



