షుగర్ పేషంట్లు ఈ పండ్లను హాయిగా తినచ్చు..

షుగర్ (డయాబెటిస్) పేషంట్స్ పండ్లు తినడం మంచిదే కానీ అన్ని రకాల పండ్లను తినకూడదు. ఒకవేళ పండ్లను తిన్నా కూడా పరిమిత మోతాదులోనే తినాలి. ఇక వేసవి కాలంలో కొన్ని రకాల పండ్లు తినడం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది.
జామ పండు: షుగర్ పేషంట్స్ జామపండు తినడం మంచిది. జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జామ పండు రక్తంలోని చక్కెరను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.
పుచ్చకాయ: వేసవి కాలంలో మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవడం కోసం పుచ్చకాయ మంచి ఆహారం. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయినా పుచ్చకాయను షుగర్ పేషెంట్స్ పరిమిత మోతాదులోనే తినాలి.
యాపిల్ : యాపిల్ పండులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువ ఆకలి కాకుండా చేస్తుంది. చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఆక్టివిటీ ని మెరుగుపరుస్తుంది. యాపిల్ పండును ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు.
బొప్పాయి: బొప్పాయి పండులో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గొప్ప గుణాలు ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల, ఇది మన ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
గమనిక: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాయబడింది. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.