మీకు బట్టతల రాబోతోందా?

Tuesday, February 5, 2019 05:00 PM Lifestyle
మీకు బట్టతల రాబోతోందా?

జుట్టు దువ్వినప్పుడు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయే జుట్టు చూస్తే ఎవరికి ఐన భయం వేస్తుంది, ఈ మధ్య కాలం లో చాలా మంది జుట్టు రాలటం సమస్య ని ఎదురుకుంటున్నారు. జుట్టు రాలిపోతోందని అని ఒత్తిడి కి గురి అవుతున్న వారు చాలా మంది ఉన్నారు, అయితే జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడే. ఒత్తిడి తో పాటు మన జీవన శైలి (తినే పదార్దాలు) జుట్టు సంరక్షణ కి మనం తీసుకునే జాగ్రత్తలు మీద కూడా ఆధారపడి ఉంటుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు చాలా రకాల మార్గాలు ఉన్నాయి, మనం హోమ్ రెమిడీస్ వాడవచ్చు లేకపోతే దగరలో ఉన్నా డాక్టర్ ని కలవటం మంచిది 

జుట్టు రాలడాన్ని తగించుకోవడానికి ఈ కింది పద్ధతులు పాటించండి.

  • జుట్టుని వారానికి రెండుసార్ల కంటే ఎక్కువ శుభ్రం చేయవద్దు.
  • హోం మేడ్ కొకనట్ ఆయిల్ వాడండి (కెమికల్ ఫ్రీ)
  • న్యాచురల్ షాంపూలు, న్యాచురల్ కండిషనర్స్ వాడటం మంచిది (కుంకుడు కాయ)
  • ఒత్తిడికి దూరంగా ఉండండి.
  • అలోవెరా పేస్ట్ ని వారానికి ఒక్కసారి అప్లై చేయండి.
  • మందార చెట్టు ఆకుల పేస్ట్ వారానికి ఒక్కసారి అప్లై చేయండి.
  • డెండ్రోఫ్ వలన కూడా జుట్టు రాలడానికి చాలా అవకాశం ఉంది, నిమ్మకాయతో జుట్టుని మర్దన చేయటం వలన డెండ్రోఫ్ సమస్యని అదిగమించవచ్చు.
  • ఎగ్స్ మరియు పాల కూర తినడం వలన జుట్టు రాలటం తాగించవచ్చు.
  • ఒమేగా 3 ఉన్న ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి.

For All Tech Queries Please Click Here..!