వైట్ హెయిర్‌ను అరికట్టేందుకు బెస్ట్ టిప్స్

Wednesday, January 30, 2019 05:30 PM Lifestyle
వైట్ హెయిర్‌ను అరికట్టేందుకు బెస్ట్ టిప్స్

సాధారణంగా వృద్దాప్యం చేరువవుతున్న కొద్ది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతాయి. కానీ ప్రస్తుత పొల్యూటెడ్ వాతావరణం వలన చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం జరుగుతుంది, దాని వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను మీరు తీసుకునే ఆహరం లో కలుపుకొంటే రంగు వేసుకోవలసిన అవసరమే ఉండదు.

ఆకుకూరలు: పచ్చని ఆకుకూరలు తలపై చెర్మాన్ని పునరుద్దపరిచే విటమిన్‌ ‘బి’ ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, వెంట్రుక యొక్క అన్ని భాగాలకు రక్తం పంపిణి చేయటానికి ‘బి-6’, విటమిన్‌ ‘బి-12’ అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగులో ఉండటానికి విటమిన్‌ ‘బి-2’ పై ఆధారపడి ఉంటుంది.

సాల్మన్‌: వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్‌లు ఎక్కువగా సాల్మన్‌ చేపలో ఉన్నాయి, సాల్మన్  చేప లో ఉండే సెలీనియం మన వెంట్రుకల ఆరోగ్యానికి చాలా అవసరం. మీ జుట్టు నెరవటాన్ని ఆపుటకు వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్మన్‌ చేపను తినండి.

గుడ్లు: మీ జుట్టు తెల్లగా మారటాన్ని ఆపాలంటే రోజూ విటమిన్‌ ‘బి-12’ తినండి. మీకు కావలసిన ఈ పోషకం గుడ్డులో లభిస్తుంది. నిజానికి ఫ్రీరాడికల్‌ లు మన వెంట్రుకలను తెల్ల రంగులోకి మారటాన్ని ప్రోత్సహిస్తాయి. అందుకుఏ రోజూ తినే ఆహార పదార్థాల్లో ఒక గుడ్డును చేర్చుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు.


మాంసం, కాలేయం: యువకుల్లో జుట్టు తెల్లగా మారటానికి గల కారణం అనీమియా, ఐరన్‌ లోపం అని చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయటపడాలంటే మాంసం, కాలేయాన్ని తినండి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్‌ ను అందిస్తాయి.

For All Tech Queries Please Click Here..!