వడదెబ్బకే అబ్బా అనిపించే గింజలు గురించి తెలుసా ?

Tuesday, March 26, 2019 10:00 AM Lifestyle
వడదెబ్బకే అబ్బా అనిపించే గింజలు గురించి తెలుసా ?

ఎండాకాలం వస్తే దాహం ఓ పట్టాన తీరదు. ఎన్ని తాగినా, ఏం చేసినా నోరు ఎండిపోతూనే ఉంటుంది. చల్లగా ఉన్నవి ఏవైనా మళ్లీ మళ్లీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక వడదెబ్బ కొడితే అంతే సంగతులు. అయితే ఈ వడదెబ్బకే అబ్బా అనిపించే గింజలు ఉన్నాయి. అవే సబ్జా గింజలు. వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరం డీ-హైడ్రేట్‌ కాదు. కాబట్టి ఈ గింజలను వేసవిలో తప్పక తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

ఓ చెంచాడు సబ్జా గింజల్ని ఓ గ్లాసు నీటిలో వేసి... ఓ పావు గంట అలా ఉంచితే చాలు... అవి చక్కగా ఉబ్బుతాయి. ఆ నీటిలో కాస్త పంచదార లేదా నిమ్మరసం వంటివి వేసుకొని తాగితే చాలు... దాహం తీరడమే కాదు... ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్నీ ప్రయోజనాలే. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు... ఎప్పుడైనా సరే... దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.

వేసవికాలం వచ్చిందంటూ సబ్జాలతో కాచిన నీళ్లు తాగమని పెద్దలు చెప్పేవారు. దీనికి వేడిని తగ్గించే గుణంతో బాటు, వేడి నుంచి రక్షించే శక్తి ఉంది. పీచు పదార్థం బాగా ఎక్కువ. డైటింగ్ చేసేవారికి వరమే. మహిళలకు కావాల్సిన ఫోలేట్ తో పాటు విటమిన్ E కూడా లభిస్తుంది. క్రీడాకారులకు బాడీ లో తేమ పోనికుండా ఉపయోగపడతాయి. ఈ మధ్య బాగా వింటున్న ఒమేగా-3 సాల్మన్ చేపలలో కంటే ఇందులో ఎక్కువగా లభిస్తుంది. బాగా చంటిపిల్లలు, వృద్దులు, గర్భిణులు తప్ప మిగిలిన వారు అందరూ తాగచ్చు.

సబ్జా గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సాయపడతాయి.టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనాన్నిస్తుంది. సబ్జా గింజల పాలను కాఫీ, టీలకు బదులు తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గుతాయి. వీటిలో విటమిన్లూ, పోషకాలూ, ఇనుమూ ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి సొంతమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి.

సబ్జా గింజలతో డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో ఈ కింది వీడియోలో చూడవచ్చు. 

For All Tech Queries Please Click Here..!