వేసవిలో రాగిజావ తాగచ్చా..?

Wednesday, April 30, 2025 02:32 PM Lifestyle
వేసవిలో రాగిజావ తాగచ్చా..?

వేసవిలో చాలామంది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి రాగిజావను సేవిస్తూ ఉంటారు. ఇది వేసవి తాపాన్ని తగ్గించి బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది. వేసవిలో నిత్యం ఒక గ్లాస్ రాగిజావ తాగడంవల్ల హీట్ స్ట్రోక్ నుండి తప్పించుకోవచ్చు. రాగి జావకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంవల్ల సైనస్ సమస్యలు తగ్గుతాయి. అయితే తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారు రాగిజావను తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రాగులు బలవర్ధకమైన ఆహారం. రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో రాగుల్లో ఉండే కాల్షియం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగుల్లో మినరల్స్‌ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: