రెగ్యులర్‌గా కాఫీ తాగడం ఆరోగ్యామా? అనారోగ్యమా..?

Saturday, February 2, 2019 04:50 PM Lifestyle
రెగ్యులర్‌గా కాఫీ తాగడం ఆరోగ్యామా? అనారోగ్యమా..?

కాఫీ ఇది ప్రతి ఒక్కరూ ఇష్టపడేది. ప్రతి ఒక్కరికి ఉదయం నిద్రలేవగానే కాఫీ కావాలి అనుకుంటారు, రోజుని కాఫీతోనే ప్రారంభిస్తారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్న అపోహలు ఉన్నాయి. కానీ కాఫీలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి అనేది వాస్తవం. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. కాఫీలో పుష్కలంగా పోషకవిలువలున్నాయి. అలాగే కాఫీలో విటమిన్ బి, రైబో ఫ్లేవిన్,మాంగనీస్, మెగ్నీషియం, నైసిన్, ప్యాంతోథెనిక్ యాసిడ్, పొటాషియం, కెఫీన్ వంటి పోషకాలుంటాయి. ఇంతేకాదు కాఫీ తీసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

కాఫీలో దాగున్న హెల్త్ బెన్ఫిట్స్ తెలుసుకుందాం

  • కాఫీలో ఉండే కెఫీన్.. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, మానసిక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏకాగ్రత పెంచడానికి కూడా కెఫీన్ సహాయపడుతుంది. 
  • కాఫీ యాంటీ డిప్రెషంట్ లా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మూడ్ మార్చేసి.. హ్యాపీగా ఉండటానికి సహాయపడుతుంది. రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ ఎవరైతే తీసుకుంటారో.. వాళ్లకు డిప్రెషన్ వచ్చే ఛాన్స్ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • రోజూ కాఫీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలో ఉండే పోలీఫెనోల్స్, క్లోరోజెనిక్ యాసిడ్ మధుమేహం నివారించటమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
  • కాఫీ ఆకలిని తగ్గిస్తుంది. కప్పు కాఫీ తాగడం వల్ల సాయంత్రం స్నాక్స్, స్వీట్స్ తీసుకోకుండా. ఆకలిని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో క్యాలరీలు కరగడానికి కూడా కాఫీ సహాయపడుతుంది.
  • కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ల్ఫమేషన్, టాక్సిన్స్ ని నిరోధించడానికి తోడ్పడతాయి. రోజుకి 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగేవాళ్లలో కాలేయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
  • కాఫీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా కాఫీ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు. అలాగే.. స్ర్టోక్ రిస్క్ ని 20 శాతానికి తగ్గిస్తుంది.
  • అల్జీమర్స్ ఎక్కువగా వయసుపైబడిన వాళ్లలో కనిపిస్తుంది. రోజుకి ఎక్కువ కప్పుల కాఫీలు తాగడం వల్ల అల్జీమర్స్ రిస్క్ 60 శాతం తగ్గుతుంది.

For All Tech Queries Please Click Here..!