మందు తాగేటప్పుడు పచ్చిమిర్చి తింటే కలిగే ప్రయోజనాలు..

Saturday, April 20, 2019 02:23 PM Lifestyle
మందు తాగేటప్పుడు పచ్చిమిర్చి తింటే కలిగే ప్రయోజనాలు..

మీరు ఎప్పుడో ఒకసారి ఓ పెగ్గు వేస్తారా అయితే ఏం పర్లేదు భయపడకుండా హ్యాపీగా తాగేసేయండంటున్నారు చాలామంది పరిశోధకులు. మందు ఎక్కువైతే లివర్ డ్యామేజ్ అవుతుంది అని మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటూ ఏ బాధపడొద్దంటున్నారు పరిశోధకులు. అయితే తాగే సమయంలో మాత్రం పచ్చిమిర్చి ముక్కలు నోట్లో వేసుకోండంటూ సలహా ఇస్తున్నారు. ఇలా పచ్చిమిర్చి ముక్కలు తినటం వలన కాలేయంకి ఎలాంటి సమస్యలు ఎదురుకావట, పలువురిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), విశాఖ ఆంధ్రా వర్సిటీ(ఏయూ) సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో మనదేశీయ పచ్చిమిర్చిలో కూడా ఎన్నో మన శరీరానికి అవసరమైన రసాయనాలు ఉన్నాయని తేలింది. మిర్చిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి లివర్ డ్యామేజ్‌ని కంట్రోల్ చేస్తాయి. దీంతో మన కాలేయానికి ఏమి కాదు కాబట్టి హాయిగా తాగే సమయంలో కాసిన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండంటూ సూచిస్తున్నారు. ఆఫ్రికన్ ట్రైబుల్స్ చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైది. ఆఫ్రికాలోని ప్రజలు తాగే సమయంలో సైడ్ స్టఫ్గా గ్రీన్ చిల్లీస్‌ని తింటారట వీరిని పరీక్షించిన అనంతరం వారికి ఎలాంటి లివర్ సంబంధిత సమస్యలు లేవని పరిశోధనలు తేల్చాయి. అయితే, ఇక మా ఆరోగ్యానికి ఏం ఢోకా లేదంటూ ఎక్కువగా ఆల్కహాల్ మరియు పచ్చిమిర్చి తినొద్దంటూ సూచిస్తున్నారు. ఇది కేవలం అప్పుడప్పుడు అదుపులో తాగేవారికి మాత్రమే అని సూచిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!