స్నానం చేసే నీటిలో ఇది చిటికెడు కలుపుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు

Saturday, May 3, 2025 07:29 AM Lifestyle
స్నానం చేసే నీటిలో ఇది చిటికెడు కలుపుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు

కొంత మంది నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని స్నానం చేస్తుంటారు. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఉప్పు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల పరిసరాల నుంచి ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా, శరీరానికి అనేక ప్రయోజనాలు కూడా అందుతాయి.

స్నానపు నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మం మురికి శుభ్రమవుతుంది. మృతకణాలను పూర్తిగా తొలగిస్తుంది. వేసవిలో చెమట వల్ల కలిగే రింగ్‌వార్మ్, దురద మొదలైన చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా ఉప్పులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. పరిగెత్తేటప్పుడు, నడిచేటప్పుడు శరీరంలో ఎక్కడైనా నొప్పి అనిపిస్తే, గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి స్నానం చేయాలి. ఇది కీళ్ల నొప్పి, మోకాలి నొప్పి, వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల వాపు కూడా తగ్గుతుంది.

ప్రతిరోజూ స్నానం నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అలసటను దూరం చేసి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి విష కణాలను బయటకు పంపుతుంది. ఇది శరీరంలో మంట, దురద, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఉప్పులో శుభ్రపరిచే లక్షణాలు ఉన్నందు వల్ల స్నానపు నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల శరీరం నుంచి ప్రతికూల శక్తి, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఎలా తయారు చేసుకోవాలి..?

ముందుగా ఒక బకెట్ ను నీటితో నింపాలి. ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. నీటిలో ఉప్పు కలిసిన తర్వాత స్నానం చేయాలి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: