నన్ను సుఖపెట్టు... అవకాశాలిస్తా... టీవీ నటికి వేధింపులు

Wednesday, April 17, 2019 12:39 PM Entertainment
నన్ను సుఖపెట్టు... అవకాశాలిస్తా... టీవీ నటికి వేధింపులు

పాపులర్ టీవీ షో కిచిడీలో... చక్కీ పరేఖ్ పాత్రతో అందర్నీ అలరించిన రిచా భాద్రా ఉన్నట్టుండి బుల్లితెరకు గుడ్ బై చెప్పింది. సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్నదానిపై రకరకాల వాదనలు వినిపించాయి. వాటికి చెక్ పెడుతూ అసలు విషయం బయటపెట్టింది రిచా. 

కాస్టింగ్ కౌచ్‌తోపాటూ లావుగా ఉండటం వల్లే టీవీ ఇండస్ట్రీని వదిలేసినట్లు తెలిపింది రిచా. టెలివిజన్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వేధింపుల్ని చాలా మంది ఎదుర్కొంటున్నారు. కొందరికి లక్కీగా అలాంటి సమస్యలేవీ లేవు. కిచిడీలో చైల్డ్ యాక్టర్‌గా చేసిన రిచా భాద్రా మాత్రం కౌస్టింగ్ కౌచ్ వేధింపుల్ని ఎదుర్కున్నట్లు తెలిపింది

పెళ్లి తర్వాత... ఆడిషన్స్‌కి వెళ్లగా... కొంతమంది రాజీ పడాలని తనతో అన్నట్లు తెలిపింది. ఓ డైరెక్టరైతే... నన్ను సుఖపెట్టు... అవకాశాలిస్తా అని ఆఫరిచ్చాడట. అతన్ని ఓ కాఫీ షాపులో కలిసి మాట్లాడాలని రిచా అనుకుంటే... అతనేమో హోటల్‌కి రమ్మన్నాడట. అలాంటి వేధింపులు... టీవీ ఇండస్ట్రీలో పైకి ఎదగాలనుకున్న తన ఆశలపై నీళ్లు చల్లాయని తెలిపింది రిచా. చైల్ యాక్టర్‌గా తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని నాశనం చేసుకోదలచుకోలేదని తెలిపింది ఈ బ్యూటీ