పదకొండేళ్లుగా అతను నా తోనే!! అందరిముందే సమంత అలా!

Sunday, March 8, 2020 01:32 PM Entertainment
 పదకొండేళ్లుగా అతను నా తోనే!! అందరిముందే సమంత అలా!

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగానే గాక, సామాజిక సేవ పరంగా కూడా సమంత వేస్తున్న అడుగులు పలువురు హీరోయిన్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఇకపోతే సామ్, తన దగ్గరైన వ్యక్తుల పట్ల కూడా చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన అసిస్టెంట్ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన ఆమె ఆసక్తికరంగా మాట్లాడింది. ఆర్య (సమంత అసిస్టెంట్) నా కుటుంబ సభ్యుడిలాంటివాడని సమంత చెప్పింది. ఏ మాయ చేసావె చివరి షెడ్యూల్‌ సమయంలో తన అసిస్టెంట్‌‌గా చేరిన ఆర్య పదకొండేళ్లుగా తన తోనే ఉన్నాడని చెప్పింది.

For All Tech Queries Please Click Here..!