ఆ సినిమా ఒప్పుకుని తప్పు చేశా: దిల్ రాజు
Wednesday, June 25, 2025 11:00 AM Entertainment
సినిమా రంగంలో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కెరీర్ లోనే ఓ పెద్ద తప్పు చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గేమ్ ఛేంజర్' సినిమాను నిర్మించడం తాను తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయమని బహిరంగంగా చెప్పడం అందరి ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఈ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
రామ్ చరణ్- శంకర్ కాంబోలో దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన 'గేమ్ ఛేంజర్' బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సాధరణంగా విజయాలకు మారుపేరుగా పేరొందిన దిల్ రాజు ఈ సినిమాతో ఊహించని నష్టాలను చూశారు. లక్కీగా అదే సమయంలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాగా ఆడడంతో దిల్ రాజు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



