ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ

Wednesday, April 30, 2025 10:59 AM Entertainment
ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ

యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ నెల 11న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో యాంకర్ దీపిక హీరోయిన్ గా నటించింది.

ఓ పల్లెటూరిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఓ అమ్మాయి పుడుతుంది. తనే రాజకుమారి (దీపిక పిల్లి). తన రాకతో ఊరికి అదృష్టం పట్టిందని ఆమెను చాలా ప్రత్యేకంగా చూస్తారందరూ. ఆ అదృష్టం ఊరు దాటి పోకూడదని.. తన కంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. ఇందుకు రాజకుమారి తండ్రి అంగీకరిస్తాడు. దీంతో అపట్నుంచి ఆ 60 మంది అబ్బాయిలు.. చిన్నతనం నుంచే రాజకుమారి మనసు గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుంటారు. ఊరిలోకి బయటి అబ్బాయిలెవరినీ రానివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక ప్రాజెక్ట్ పని మీద వస్తాడు ఇంజినీర్ కృష్ణ (ప్రదీప్ మాచిరాజు). కొన్ని రోజులకు కృష్ణ-రాజకుమారి ప్రేమలో పడతారు. ఊర్లో వాళ్లకు విషయం తెలియకుండా దాచిపెట్టిన ఈ జంట.. తర్వాత అందరికీ దొరికిపోతుంది. మరి ఊరి కట్టుబాటును దాటి ఈ జంట ఎలా ఒక్కటైంది? ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది మిగతా కథ.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: