లక్ష్మీస్ ఎన్టీర్ విడుదలకు బ్రేక్: సెన్సార్ బోర్డుపై కోర్టుకెళుతున్న ఆర్జీవీ

Wednesday, March 20, 2019 08:05 PM Entertainment
లక్ష్మీస్ ఎన్టీర్ విడుదలకు బ్రేక్: సెన్సార్ బోర్డుపై కోర్టుకెళుతున్న ఆర్జీవీ

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఏ సినిమా తీసినా ఏదో విధంగా వార్తల్లోకెక్కుతూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా వర్మ చిత్రీకరించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజ్ అయితే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది.

ఎలక్షన్ కమీషన్ నుండి వచ్చిన సూచనల మేరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర బృందానికి సెన్సార్ బోర్డు నుండి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక అంటే.. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వబోమని స్పష్టం చేస్తూ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బృందానికి తెలియజేసింది. అయితే సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతూ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశం, అందుకు గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంలో వచ్చిన మార్పుల గురించిన ప్రధాన ఇతివృత్తిమే లక్ష్మీస్ ఎన్టీర్ అంటూ వర్మ పేర్కొన్నారు. అస్సలు సినిమా విడుదలను ఆపే హక్కు సెన్సార్ బోర్డుకు ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా.. సెన్సార్ బోర్డు నిర్ణయంపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానంటూ ప్రకటించారు.

For All Tech Queries Please Click Here..!