హరిహర విరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday, June 21, 2025 08:46 AM Entertainment
హరిహర విరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 7:23 నిమిషాలకు మూవీ నుంచి కీలక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే మూవీ జూలై 24న విడుదల కానున్నట్లు సమాచారం.

వస్తావానికి ఈ సినిమా మార్చి నెలలో విడుదల కావాల్సి వుంది. కానీ షూటింగ్ డిలే కారణంతో పాటు థియేట్రికల్ బిజినెస్ వ్యవహారం తెగకపోవడంతో రిలీజ్ కు కాలేదు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను డిసైడ్ చేస్తోంది. జులై మొదటి వారంలో హరిహరను థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. అక్కడ కుదరకుంటే ఆగస్టు ఫస్ట్ వీక్ అనుకోగా అందుకు అమెజాన్ ప్రైమ్ ససేమిరా అనడంతో జులై 24న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది హరిహర. ఇప్పటికే అనేక సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో డిజిటల్ రైట్స్ ధర తగ్గిస్తూ వస్తుంది అమెజాన్. ఇక చేసేదేమి లేక రిలీజ్ కు చేసేందుకు రెడీ అయ్యారు ఏ ఎం రత్నం.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: