గూస్ బంప్స్ తెప్పిస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ (వీడియో)

Thursday, July 3, 2025 11:36 AM Entertainment
గూస్ బంప్స్ తెప్పిస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ (వీడియో)

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మూవీ `హరిహర వీరమల్లు'. మూవీ గురించి వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ జులై 24న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో హీరో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్లు నిధి అగర్వాల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.

హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడుపోసుకుంటున్న సమయం.. అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. “ఇప్పటి దాకా మేకలు తినే పులిని చూసి ఉంటారు. ఇప్పుడు పులులను వేటాడే బెబ్బుల్ని చూస్తారు.” అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక్కడే ఆ ట్రైలర్ ను చూసేయండి...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: