ప్రముఖ టాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు
Tuesday, July 22, 2025 07:05 AM Entertainment
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి ఈడీ షాక్ ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది. దీంతో జులై 23న రానా, 30న ప్రకాశ్ రాజ్ విచారణకు రావాలని ఆదేశించింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.
వీరందరూ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై, ఈ కేసులో తమకు తెలిసిన సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో డ్రగ్స్ కేసులోనూ సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసులోనూ సెలబ్రిటీల పేర్లు బయటకి రావడంతో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



