మహిళ ముందు ప్యాంట్ జిప్ తీసి చూపిస్తూ..

Thursday, April 17, 2025 12:06 PM Crime
మహిళ ముందు ప్యాంట్ జిప్ తీసి చూపిస్తూ..

మహిళను చూస్తూ ఆమె ముందే ఓ కుర్రాడు తన ప్యాంటు జిప్‌ తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నించిన మహిళ భర్తపై, స్థానికులపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని క్వీన్స్ రోడ్‌లోని రాజీవ్ గాంధీ కాలనీలో చోటు చేసుకుంది. 

ఏప్రిల్ 13న సోమవారం రాత్రి 10:30 గంటలకు ఒక మహిళ భోజనం ముగించి రెండవ అంతస్తులో పడుకోబోతుండగా, ఎదురుగా ఉన్న ఇంటి నుండి కార్తీక్ అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ప్యాంటు జిప్‌ తీసి, తన ప్రైవేట్ పార్ట్స్‌ను చూపిస్తూ ఆమెను ఆ పని కోసం ప్రేరేపిస్తూ వికృతంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయినా కూడా ఆ కుర్రాడు బెదరకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన చుట్టపక్కల వాళ్లు అతడిని నిలదీశారు. దీంతో వారిపై ఆ యువకుడు దాడికి తెబడ్డాడు. ఆపడానికి వచ్చిన తన తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్నారు. కార్తీక్ తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనకు సంబంధించి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు గతంలో చాలా మంది మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: