కూతురి మామతో మహిళ ప్రేమాయణం.. చివరికి ఇద్దరూ కలిసి..

Saturday, April 19, 2025 02:00 PM Crime
కూతురి మామతో మహిళ ప్రేమాయణం.. చివరికి ఇద్దరూ కలిసి..

మరో దరిద్రపు ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బదౌన్‌లో వెలుగుచూసింది. ఓ మహిళ తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సునీల్, మమత(43)కు 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన పెద్ద కుమార్తెను బదౌన్ సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు.

తన కూతురి వివాహం అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతున్న కారణంగా నెలలో కొద్దిరోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్‌ లేని సమయంలో శైలేంద్ర మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన వారు తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో వీరి సంబంధం బట్టబయలైంది.

ఈ నేపథ్యంలో బాధితుడు, భర్త సునీల్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్‌ మాట్లాడుతూ "నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. అయినప్పటికి నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు. శైలేంద్రకు ఫోన్‌ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అంతా తీసుకుని పారిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మమత కుమారుడు మాట్లాడుతూ "మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మమ్మల్ని వేరే గదికి పంపించే వారు. ఆమె మామతో కలిసి టెంపోలో పారిపోయింది" అని చెప్పారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: