భార్య చేతిలో మరో భర్త హతం
Wednesday, August 27, 2025 11:00 AM Crime
ఇటీవల కాలంలో భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన నాగలక్ష్మి అనే వివాహిత తన ప్రియుడు మహేష్ మోజులో పడి భర్త హరిచరణ్ ను హతమార్చింది. నాగలక్ష్మి, ప్రియుడు మహేష్ లు కలిసి హరిచరణ్ మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
తరువాత బాత్రూంలో తన భర్త మూర్ఛతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



