ప్రియుడికోసం మరో భార్య దారుణం
Thursday, August 21, 2025 10:09 PM Crime
ఏపీలోని కృష్ణా జిల్లాలో ప్రియుడి కోసం ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
సమీప బంధువుతో ఏర్పడిన వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసింది. ప్రియుడు ప్రదీప్ తో కలిసి భర్తను హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)