ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని నమ్మించి.. రూముకు పిలిచి.. విద్యార్థినిపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
Tuesday, May 13, 2025 10:00 AM Crime

ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని నమ్మించి రూముకు పిలిచి ఆ విద్యార్థినిపై ఇద్దరు యువకుల అఘాయిత్యానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చెన్నెలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని తన స్నేహితుడు అజయ్ ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్ కు పిలిపించాడు.
కూకట్పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న ఆ యువతిని పార్టీ చేసుకుందామని తన స్నేహితుడు హరి ఫ్లాట్ కు రావాలని పిలిచాడు. అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్ కు ఆ యువతి వెళ్ళింది. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అజయ్, హరి ఇద్దరూ రేప్ చేశారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: