తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని..
Tuesday, July 1, 2025 10:00 AM Crime
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని కొడుకులు ఓ వ్యక్తిని హత్య చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తాలూకాలోని కుంభేశ్వర్ వీధిలో వాసు అలియాస్ వసంత్ (35) దారుణంగా హత్యకు గురయ్యారు. కుంభేశ్వర్ వీధి నుండి ఎకె కాలనీకి వెళ్లే వసంత్ ను ఆకాష్, హరీష్ అనే ఇద్దరు సోదరులు కత్తితో హత్య చేశారు.
మృతుడు వసంత్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నిన్న మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో ఆ మహిళ సవతి కుమారుడు హరీష్, సొంత కొడుకు ఆకాష్ కలిసి వసంత్ ను కొట్టి చంపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



