ముందు సీటు కోసం గొడవ.. తండ్రిని గన్ తో కాల్చి చంపిన కొడుకు

Saturday, June 28, 2025 05:38 PM Crime
ముందు సీటు కోసం గొడవ.. తండ్రిని గన్ తో కాల్చి చంపిన కొడుకు

దేశ రాజధాని ఢిల్లీలోని తిమ్మాపూర్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు వాహనం ముందు సీట్లో కూర్చోవడంపై తండ్రి కొడుకులిద్దరికి వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన కుమారుడు లైసెన్స్ గన్ తో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ మేరకు తిమ్మాపూర్ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు కాల్పుల శబ్దం విని అక్కడికి చేరుకున్నారు. అనంతరం అతని అదుపులోకి తీసుకొని అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: