యూట్యూబ్ చూసి దొంగతనాలు... ఏడుగురు బిటెక్ విద్యార్థులు అరెస్ట్

Tuesday, July 15, 2025 10:04 PM Crime
యూట్యూబ్ చూసి దొంగతనాలు... ఏడుగురు బిటెక్ విద్యార్థులు అరెస్ట్

బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు చోరీ చేసిన వాహనాల్లో ఏకంగా 16 బుల్లెట్ బండ్లు ఉన్నాయి. వీరంతా యూట్యూబ్ చూసి దొంగతనాల్లో నైపుణ్యం సంపాదించారు. అద్దంకి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా జరిపిన విచారణలో వీరి నేర చరిత్ర బయటపడింది.

పోలీసుల విచారణలో, ఈ విద్యార్థులు కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలించి, వాటిని అమ్మకం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన విద్యార్థుల నుంచి పోలీసులు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టవర్ డంప్ టెక్నాలజీ ద్వారా ఈ బైక్ దొంగల ఆచూకీ తెలుసుకున్నామని జిల్లా ఎస్పీ తుషార్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఆరుగురు విద్యార్థులు ఒంగోలులో, మరొకరు కందుకూరులో చదువుతున్నారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: