హనీమూన్ మర్డర్: బయటపడ్డ సంచలన విషయాలు
Friday, July 4, 2025 03:00 PM Crime
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ ఇన్సిడెంట్ రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రఘువంశీ భార్య సోనమ్ హ్యాండ్ బ్యాగ్ లో రెండు మంగళసూత్రాలు లభ్యమయ్యాయి. అయితే సోనమ్ కు రెండో మంగళసూత్రం ఎవరు ఇచ్చారు? ఆమె ప్రియుడు రాజా ఇచ్చాడా? లేక ఇంతకు ముందే వారిద్దరికీ వివాహం అయిందా? లేదా తన ప్రియుడిని పెళ్లి చేసుకుందా? అనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.
మరో వైపు రాజా రఘువంశీ అన్నయ్యలు విపిన్, సచిన్ మరోసారి నిందితులకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. విపిన్ రఘువంశీ మాట్లాడుతూ సోనమ్‌కు తాము రూ.17-18 లక్షల విలువైన నగలు ఇచ్చామని, వాటితో ఆమె బహుశా హనీమూన్‌కు వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. ఈ హత్యలో పాల్గొన్న వారందరికీ కఠినమైన శిక్ష విధించాలని రాజా రఘువంశీ అన్నయ్యలు డిమాండ్ చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)