9వ తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన స్కూల్ ప్రిన్సిపాల్

Tuesday, July 29, 2025 02:42 PM Crime
9వ తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన స్కూల్ ప్రిన్సిపాల్

స్కూల్ ప్రిన్సిపాల్ 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన దారుణ ఘటన కోనసీమ జిల్లా రాయవరం మండలంలో వెలుగులోకి వచ్చింది. మాచవరం గ్రామంలో 9వ తరగతిలో ఉన్న విద్యార్థినిపై ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా ఉంది.

ఇదే అదునుగా భావించిన ప్రిన్సిపాల్ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థినికి 3 నెలలుగా పీరియడ్స్ రాలేదని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెల్లారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థిని గర్భవతి అయిందని నిర్దారించారు. జరిగినదంతా విద్యార్థిని తెలపడంతో ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: