భార్యను కడతేర్చేందుకు దుబాయ్ నుంచి వచ్చాడు

Wednesday, February 13, 2019 02:42 PM Crime
భార్యను కడతేర్చేందుకు దుబాయ్ నుంచి వచ్చాడు

కట్టుకున్న భార్య మీద పెంచుకున్న అనుమానం అతడిని రాక్షసున్ని చేసింది... ఆ ఇల్లాలిని కాటికి పంపింది. నిజానిజాలు తెలుసుకోకుండా మూర్ఖంగా భార్యపై అనుమానం పెంచుకుని పథకం ప్రకారం కడతేర్చాడు. అంతే కాకుండా, తన భార్యను చంపేందుకు దుబాయ్ నుంచి వచ్చి, చంపేసిన అనంతరం తానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

గద్వాల్‌కు చెందిన రహీమ్ కొంత కాలంగా దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అయితే, తన భార్య బేగమ్ మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారు. తన అనుమానం నిజం అని భావించిన రహీమ్ పథకం ప్రకారం హైదారాబాద్‌కు వచ్చి భార్య బేగమ్‌ను గద్వాల్ నుండి సిటీకి రప్పించాడు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. బేగమ్ గదికి వచ్చిన తర్వాత ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తన భార్యను చంపేసినట్లు పోలీసులకు సమాచారమిచ్చిన రహీమ్ అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు

For All Tech Queries Please Click Here..!