గురు పౌర్ణమి రోజే ప్రిన్సిపల్ దారుణ హత్య
Thursday, July 10, 2025 09:55 PM Crime
గురు పౌర్ణమి రోజున గురువులను పూజించుకోవాల్సిన తరుణంలో హరియణాలో ప్రిన్సిపల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం హిసార్ లోని కర్తార్ మెమోరియల్ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది.
జుట్టు కత్తిరించుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని ప్రిన్సిపల్ చెప్పగా 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆయనను కత్తితో పొడిచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా విద్యార్థులు ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



