లగేజీ బ్యాగులో రెండేళ్ల చిన్నారి...

Monday, August 4, 2025 04:30 PM Crime
లగేజీ బ్యాగులో రెండేళ్ల చిన్నారి...

లగేజీ బ్యాగులో రెండేళ్ల చిన్నారిని తీసుకెళ్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన న్యూజిలాండ్ లో జరిగింది. ఉత్తర దిక్కున ఉన్న కైవాకా అనే పట్టణంలో ఓ బస్సులోని లగేజీ నుంచి పాపను రక్షించారు. ఓ ప్రయాణికుడు లగేజీ కంపార్ట్మెంట్ యాక్సెస్ కావాలని కోరగా, ఆ సమయంలో డ్రైవర్ కదులుతున్న బ్యాగ్ ను గుర్తించాడు.

వెంటనే ఆ లగేజి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో రెండేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌లో 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ఆ చిన్నారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. 

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: