వదిన తల నరికి.. పోలీస్ స్టేషన్‌కు (వీడియో)

పశ్చిమ బెంగాల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వదిన తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసుల ముందు తలను, కత్తిని ఉంచి లొంగిపోయాడు.
బిమల్ మండల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని బసంతి టౌన్ లో నివాసం ఉంటున్నాడు. గతకొంత కాలం నుంచి బిమల్ కుటుంబానికి ఆమె వదిన కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా బిమల్, అతడి వదినకు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరటంతో బిమల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పదునైన కత్తితో వదినపై దాడిచేసి తల నరికి చంపేశాడు. తలను ఓ చేత్తో, మరో చేత్తో కత్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్ బయలు దేరాడు. అది కూడా రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతడు తలను పట్టుకుని నడవటం చూసి జనం షాక్‌తోపాటు షేక్ అయ్యారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు. మరికొంతమంది వీడియోలు తీసుకోవటం కోసం అతడ్ని ఫాలో అయ్యారు. బిమల్ ఎవర్నీ పట్టించుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తలను, కత్తిని పోలీసులకు స్వాధీనం చేసి లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.