అన్నాచెల్లెళ్లని తెలియక ప్రేమ.. 8 నెలల గర్భవతిగా ప్రియురాలు.. చివరికి...

Tuesday, July 29, 2025 10:23 PM Crime
అన్నాచెల్లెళ్లని తెలియక ప్రేమ.. 8 నెలల గర్భవతిగా ప్రియురాలు.. చివరికి...

అన్నాచెల్లెళ్లని తెలియక ప్రేమించుకున్నారు. యువతి గర్భవతి అయింది. చివరికి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న తమిళనాడు తిరుపోరూర్ పక్కన ఉన్న తండలం పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సెల్వరాజ్ కుమారుడు సురేంద్రన్ (28) షోలింగనల్లూర్లో నివసించే బంధువు ప్రియాంక (25) చిన్నప్పటి నుంచి స్నేహితులు.

ఇంజినీర్ అయిన ప్రియాంక పోరూర్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. సురేంద్రన్ తల్లి, ప్రియాంక తల్లి అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ కుటుంబాల్లో ఎవరూ సురేంద్రన్, ప్రియాంక స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం వారికి తెలియగానే రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి మధ్య ప్రేమ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని వ్యతిరేకించాయి. ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. ఎంతకూ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్, ప్రియాంక మనస్తాపంతో మంగళవారం తండలం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్ తిరిగి రాకపోయేసరికి, అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్ రూంలో సురేంద్రన్, ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: