ఫామ్ హౌస్ లో లిక్కర్, డ్రగ్స్ పార్టీ.. అదుపులోకి విదేశీయులు

Friday, August 15, 2025 12:55 PM Crime
ఫామ్ హౌస్ లో లిక్కర్, డ్రగ్స్ పార్టీ.. అదుపులోకి విదేశీయులు

హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు అకస్మిక దాడులు చేశారు. బాకారం గ్రామ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు రైడ్ చేయగా పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలోకి విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని విషయంపై విచారణ చేపట్టారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: