అదనపు కట్నం ఇవ్వలేదని ఎయిడ్స్ ఇంజక్షన్ వేశారు
Sunday, February 16, 2025 02:42 PM Crime
అదనపు కట్నం తేలేదనే కోపంతో అత్తమామలు తమ కోడలికి ఎయిడ్స్ (హెచ్ఐవి) ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండుకు చెందిన అభిషేక్ కు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ యువతితో గతేడాది పెళ్లెంది. అప్పట్లో రూ.15 లక్షల కట్నం ఇచ్చారు.
ఇటీవల స్కార్పియో కారు కొనడానికి రూ.25 లక్షలు తేవాలని భర్త, అతని తల్లిదండ్రులు ఆ యువతిని వేధించారు. ఆమె ఒప్పుకోకపోవడంతో HIV సోకిన సిరంజితో ఇంజెక్ట్ చేశారు. ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
