4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఏమైందో ఏమో గానీ..
Wednesday, May 28, 2025 09:12 PM Crime
4 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల ఓ కూతురు కూడా ఉంది. కారణం ఏంటో తెలీదు కానీ కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
గొడవలో భాగంగా భార్యను పది సార్లు అత్యంత పాశవికంగా పొడిచి మరీ ఆమె ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరులో చోటుచేసుకుంది. అనంతరం భర్త అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)