ఘోరాతి ఘోరం: డ్యాన్సర్‌పై ఒకరు తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్

Sunday, April 7, 2019 12:00 PM Crime
ఘోరాతి ఘోరం: డ్యాన్సర్‌పై ఒకరు తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్

ఆమె ఓ డాన్సర్. వయసు 20 ఏళ్లు ఢిల్లీలోని కజౌరీ ఖాస్‌లో ఓ డాన్స్ కార్యక్రమం చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. అక్కడికి వెళ్లేందుకు ఓ బస్సు ఎక్కింది. ఆమెను చూసిన ముగ్గురు కుర్రాళ్లు అదే బస్సు ఎక్కారు. మెల్లగా మాటలు కలిపారు. ఆమె ఇదివరకెప్పుడూ ఢిల్లీకి వెళ్లకపోవడంతో కాస్త కంగారు పడుతూ ఉంది. అది గమనించిన వాళ్లు... ఆమెతో మాట్లాడటం ద్వారా... ఆమెకు ఢిల్లీ విషయాలు ఏవీ తెలియవని గ్రహించారు. అసలు ఆ డాన్స్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో కూడా కచ్చితమైన అడ్రెస్ ఆమెకు తెలియదన్న విషయం వాళ్లకు తెలిసింది. వెంటనే ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. తామూ ఆ కార్యక్రమానికే వెళ్తున్నామని చెప్పారు. ఆ అమాయక డాన్సర్ నిజమేననుకుంది. వాళ్లు చాలా మంచివాళ్లలా నటించారు. ఆమెను దగ్గరుండి డాన్స్ ప్రోగ్రాంకి తీసుకెళ్తామని చెప్పారు. ఆమె సరేనంది.

కొంతదూరం బస్సు వెళ్లాక... ఆ ముగ్గురు అక్కడ దిగిపోవాలన్నారు. అక్కడి నుంచీ అడ్డదారి ఉందనీ, ఈజీగా వెళ్లిపోవచ్చని ఆమెతో చెప్పారు. వాళ్ల మాటలు నమ్మిన ఆ అభాగ్యురాలు... కాశ్మీరీ గేట్ దగ్గర బస్సు దిగింది. ఆ ముగ్గురూ ఆమెను బవానాలోని నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లారు. వాళ్లను పూర్తిగా నమ్మిన ఆ బాధితురాలు... తన చుట్టూ ఎలాంటి ఉచ్చు అల్లుకుంటోందో గ్రహించలేకపోయింది. ఎవరూ లేని వైపు ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు... ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మృగాల్లా ప్రవర్తించారు. నమ్మి వాళ్లతో వెళ్లినందుకు ఆమె నిస్సహాయురాలే ఆ మానవమృగాల చేతిలో చిక్కుకున్నట్లైంది.

ఆ దుర్మార్గులు ఆమె చేతిలో సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె సెల్‌ఫోన్‌ని ట్రాక్ చేసిన పోలీసులు... ఆ ముగ్గుర్నీ గుర్తించి అరెస్టు చేశారు.

For All Tech Queries Please Click Here..!