5 నెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..
Sunday, May 11, 2025 12:34 PM Crime

ప్రేమజంటపై కత్తితో దాడి చేసిన ఘటన భూపాలపల్లి గణపురం మండలం చెల్పూరు గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది. చెల్పూర్ గ్రామానికి చెందిన జ్యోతి, ప్రశాంత్ 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరవడంతో పెద్దలు అంగీకరించలేదు. అయితే.. జ్యోతి సోదరుడు వారి ప్రేమను ఒప్పుకున్నట్లు నటించి వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అడ్డు వచ్చిన ప్రశాంత్ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: