కొత్త ఫీచర్లతో సరికొత్త రెనో డస్టర్ విడుదల

Thursday, February 7, 2019 12:00 PM Automobiles
కొత్త ఫీచర్లతో సరికొత్త రెనో డస్టర్ విడుదల

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో(Renault) 2019 డస్టర్ ఎస్‌యూవీని దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2019 రెనో డస్టర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13.09 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. రెనో తమ అప్‌డేటెడ్ వెర్షన్ 2019 డస్టర్ ఎస్‌యూవీలో సరికొత్త ఫీచర్లతో పాటు అత్యంత సరసమైన డీజల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది.

కొత్త తరం రెనో డస్టర్ ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. భద్రత పరంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టిమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

సాంకేతికంగా 2019 రెనో డస్టర్ ఎస్‌యూవీలో అవే మునుపటి 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో 105బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతోంది. అయితే, 1.5-లీటర్ డీజల్ వేరియంట్ 84బిహెచ్‌పి/200ఎన్ఎమ్ మరియు 108బిహెచ్‌పి/248ఎన్ఎమ్ ఇలా రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది. పవర్ అవుట్‌పుట్ వేరియంట్ల ఆధారంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.