నిస్సాన్ ఇండియాకు ప్రాణం పోసిన కిక్స్ ఎస్‌యూవీ

Tuesday, February 12, 2019 05:00 PM Automobiles
నిస్సాన్ ఇండియాకు ప్రాణం పోసిన కిక్స్ ఎస్‌యూవీ

నిస్సాన్ మోటార్స్ ఇటీవల విడుదల చేసిన కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకుని నిస్సాన్ ఇండియా సేల్స్‌లో అత్యధిక సేల్స్ సాధించిన బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. జనవరి 2019 నెలలో దేశవ్యాప్తంగా 1,370 యూనిట్ల కిక్స్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. అంతే కాకుండా నిస్సాన్ ఇండియా మొత్తం విక్రయాల్లో 50 శాతానికి పైగా వాటా కిక్స్ సొంతం చేసుకుంది.

నిస్సాన్ మార్కెట్ నుండి తొలగించిన టెర్రానొ ఎస్‌యూవీని స్టాక్ ఉన్నంత వరకు డీలర్లకు డెలివరీ ఇవ్వనుంది. గత జనవరిలో 16 యూనిట్ల టెర్రానో ఎస్‌యూవీలు, 96 మైక్రా కార్లు మరియు 18 యూనిట్ల సెడాన్ కార్లను మాత్రమే విక్రయించింది. మొత్తం మీద జనవరి 2019లో 1,500 కార్లను విక్రయించగలిగింది.

బడ్జెట్ రేంజ్ కార్లను విక్రయించాలనే ఉద్దేశ్యంతో నిస్సాన్ ఇండియా భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన డాట్సన్ ఆశించిన ఫలితాలు సాధించింది. రెడి-గో, గో మరియు గో+ మోడళ్లతో జనవరి 2019 లో 1700 కార్లను విక్రయించింది. నిస్సాన్-డాట్సన్ సంయుక్తంగా 3000 కార్ల వరకు విక్రయించింది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ రెనో డస్టర్ మరియు హ్యుందాయ్ క్రెటా మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది. కిక్స్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 9.55 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. పెట్రోల్ వెర్షన్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా డీజల్ వెర్షన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్‌తో పాటు ఆప్షనల్‌గా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఎంచుకోవచ్చు.

For All Tech Queries Please Click Here..!