విడుదలకు ముందే 4 వేలకు పైగా బుకింగ్స్

Monday, February 11, 2019 04:00 PM Automobiles
విడుదలకు ముందే 4 వేలకు పైగా బుకింగ్స్

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి 4 న తమ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉండటంతో మహీంద్రా ఎక్స్‌యూవీ300 వెహికల్‌కు భారీ స్పందన లభిస్తోంది.

మహీంద్రా తమ అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మీద బుకింగ్స్ ప్రారంభించినుప్పటి నుండి విపరీతమైన ఎంక్వైరీలు మరియు మహీంద్రా ఊహించని విధంగా ఏకంగా 4,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, హోండా డబ్ల్యూఆర్-వి వంటి మోడళ్లకు సరాసరి పోటీనిచ్చేలా అభివృద్ది చేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా దక్షిణకొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం శాంగ్‌యాంగ్ మోటార్స్‌తో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇరు సంస్థల భాగస్వామ్యంతో మహీంద్రా దేశీయంగా విడుదల చేస్తున్న రెండవ మోడల్ ఈ ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ, అయితే మొదటి మోడల్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన అల్టురాస్ జి4 ప్రీమియం ఎస్‌యూవీ, ఇది కంపెనీ యొక్క హైఎండ్ మోడల్. మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పజేరో మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి మోడళ్లకు పోటీగా అల్టురాస్ జి4 మోడల్‌ను లాంచ్ చేశారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటీ గల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. రెండు ఇంజన్ వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ధర, వేరియంట్లు మరియు ఇతర స్పెసిఫికేషన్ల కోసం "షార్ట్ హెడ్ లైన్స్ తెలుగు"తో కలిసి ఉండండి... 

For All Tech Queries Please Click Here..!